
● ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా మహోత్సవాలు ● నేడు బాల
ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా మహోత్సవాలు
నేడు బాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం
ఉదయం 8 గంటల తర్వాతే భక్తులకు దర్శన భాగ్యం
ఈ ఏడాది దుర్గమ్మకు 11 అలంకారాలు అమ్మ కొండకు పండగొచ్చింది
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం శ్రీ దేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాల తొలి రోజైన సోమవారం శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తొలుత అమ్మవారి ప్రధాన ఆలయంలోని ఉత్సవమూర్తిని మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొస్తారు.
అక్కడ ఉత్సవమూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాల నిర్వహణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చనలు, చండీయాగం, శ్రీచక్ర నవార్చనలు మొదలవుతాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో సాయంత్రం వేళ అమ్మవారికి పంచహారతుల సేవ సమయంలో క్యూలైన్లు యథావిధిగా నడిపించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశతో పాటు దేవదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. అంతరాలయంలో పంచహారతులు జరుగుతుండగానే రూ.300, రూ.100 క్యూలైన్‌తో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు నడుస్తూ ఉంటాయి. ఏర్పాట్లను దేవదాయ శాఖ, దుర్గగుడి అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులు ఆదివారం మరో మారు తనిఖీ చేశారు.

● ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా మహోత్సవాలు ● నేడు బాల