
2 హోల్డింగ్‌లు.. 5 క్యూలైన్లు
వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావిస్తున్న అధికార యంత్రాంగం సీతమ్మవారి పాదాల వద్ద, వీఎంసీ కార్యాలయం సమీపంలో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు హోల్డింగ్ పాయింట్లలో సుమారు 12వేల మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇక వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్లకు చైనా వాల్ వద్ద మరో క్యూలైన్, ఓం టర్నింగ్ వద్ద మరో క్యూలైన్ కలిసి మొత్తంగా ఐదు క్యూలైన్లు అలయం వరకు కొనసాగుతాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న ఈ క్యూలైన్లలో అత్యవసరమైన సేవలతో పాటు అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకుంటారు.