
కీలకంగా మారనున్న కుమ్మరిపాలెం క్యూలైన్లు
ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో కుమ్మరిపాలెం క్యూలైన్లు కీలకం కానున్నాయి. గతంలో భవానీపురం వైపు నుంచి వచ్చే భక్తుల కోసం హెడ్ వాటర్ వర్కు నుంచి క్యూలైన్లు ప్రారంభమయ్యేవి. అయితే ఈ ఏడాది ఈ క్యూలైన్లలను కుమ్మరిపాలెం సెంటర్ వరకు ఏర్పాటు చేశారు. తెలంగాణ వైపు నుంచి వచ్చే భక్తులతో పాటు భవానీపురం, గట్టు వెనుక ప్రాంతం, సింగ్‌నగర్, వాంబే కాలనీ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కుమ్మరిపాలెం క్యూలైన్లే కొండపైకి చేరుకునేందుకు దగ్గర మార్గం అవుతాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరూ మహా మండపం, గోశాల, కనకదుర్గనగర్ మీదగానే బయటకు వెళ్లేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.