
క్యాన్సర్‌కూ ఉంది ఆన్సర్
బాధితులకు భరోసా గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా కార్పొరేట్ వైద్యం ఆధునిక చికిత్సలతో నివారణ నేడు వరల్డ్ రోజ్ డే
అందుబాటులో ఆధునిక వైద్యం
రోజ్ డే నేపథ్యం
కెనడా దేశానికి చెందిన 12 ఏళ్ల మెలిండా రోజ్ అనే బాలిక 1994లో క్యాన్సర్ వ్యాధికి గురైంది. అది కూడా చాలా అరుదైన బ్లడ్ క్యాన్సర్. కొన్ని వారాల్లోనే చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. కాని రోజ్ భయపడకుండా ఆస్పత్రిలో ఉన్న రోగులకు రోజూ పువ్వులు అందించేది. వారికి కవితలు వినిపించి రోగుల్లో మనో ఉల్లాసాన్ని కలిగించేది. ఇలా ఆరునెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోగులను చిరునవ్వుతో పలుకరిస్తూ ఉండేది. ఉత్తరాలు రాస్తూ వారిలో ఆనందం, ఉత్సాహాన్ని నింపుతూ సెప్టెంబరు 22న మరణించింది. ఆ బాలిక జ్ఞాపకార్థం ప్రతి ఏడాది రోజ్ డేను నిర్వహిస్తున్నారు.
గుంటూరు మెడికల్: క్యాన్సర్ .. ఈ వ్యాధి పేరు చెబితేనే చాలా మందికి ఒంట్లో వణుకు పుడుతుంది. వస్తే చనిపోవటమే అనే అపోహల్లో ప్రజలు ఉన్నారు. పూర్వ రాచపుండుగా పిలువబడే క్యాన్సర్ వ్యాధికి చికిత్స ఉండేది కాదు. వ్యాధిగ్రస్తులు మరణానికి రోజులు లెక్క బెట్టుకుంటూ గడిపేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. బాధితుల్లో భయాన్ని పోగొట్టి వారిలో మానసిక ధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 22న రోజ్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
క్యాన్సర్‌కు కారణాలు
క్యాన్సర్ రావటానికి ప్రధాన కారణం పొగాకు ఉత్పుత్తుల వినియోగమే. సిగిరెట్, బీడీ, చుట్ట , పాన్‌పరాగ్, ఖైనీ, గుట్కా.. ఇలా ఏ రూపంలో పొగాకును తీసుకున్నా వస్తుంది. మద్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఆకు కూరలు తినకపోవడం, ఊరగాయ పచ్చళ్లు, కొవ్వు ఎక్కువగా ఉన్న మాంసాహారం తినడం, అధిక బరువు ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.
జీజీహెచ్‌లో అత్యాధునిక వైద్య సేవలు
గుంటూరు జీజీహెచ్‌లో 2020 జులైలో అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు నాట్కో క్యాన్సర్ సెంటర్‌ను మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కోట్ల రూపాయలతో పెట్ స్కాన్‌ను ఏర్పాటు చేశారు. 100 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.
జీజీహెచ్‌లో చికిత్స పొందిన వారి వివరాలు
క్యాన్సర్‌కు నేడు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ, టార్గెట్‌థెరపీ ద్వారా త్వరగా కోలుకుంటున్నారు. నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్ ద్వారా చాలా త్వరగా గుర్తించవచ్చు. ఏ జీన్‌లో తేడా వల్ల సోకుతుందనే విషయం తేటతెల్లమవుతుంది. కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ ఉంటే ఇతరులకు వచ్చే అవకాశం ఉందా లేదా నిర్ధారించే బీఆర్‌సీఏ–1, 2 పరీక్షలు ఉన్నాయి. లాప్రోస్కోపిక్, రొబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి.
–డాక్టర్ ఎం.జి.నాగకిశోర్,
సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్, గుంటూరు
ఆపరేషన్లు
సంవత్సరం
రోగుల
సంఖ్య
2020 2067 –
2021 5,865 114
2022 13,107 395
2023 14,647 753
2024 ఆగస్టు వరకు 9,376 542

క్యాన్సర్‌కూ ఉంది ఆన్సర్

క్యాన్సర్‌కూ ఉంది ఆన్సర్