
శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన
చేబ్రోలు: భారీ వర్షాలు, వరదలకు మండలంలోని శలపాడు, వీరనాయకునిపాలెం గ్రామాల్లో నీట మునిగి దెబ్బతిన్న వరి పొలాలను శనివారం వ్యవసాయశాఖాధికారులు పరిశీలించారు. సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన ‘‘రెక్కల కష్టం... వర్షార్పణం’’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా స్థానిక ఏవో పి. ప్రియదర్శిని మాట్లాడుతూ శేకూరు, శలపాడు రెవెన్యూ గ్రామాల పరిధిలో రైతులు నాలుగు వేల ఎకరాల్లో వరి సాగు చేశారని తెలిపారు. పంట కూడా 30రోజులు పైబడిన దశలో ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిల్వ ఉన్న పొలాలను పరిశీలించామని, ప్రాథమిక నివేదికను జిల్లా వ్యవసాయశాఖాధికారికి సమర్పించినట్లు తెలిపారు. వ్యయసాయశాఖ సిబ్బంది, మైలా రామరాజు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు వెస్ట్: బీఆర్ స్టేడియంలో శనివారం అండర్– 14, అండర్– 17, అండర్– 19 జిమ్నాస్టిక్స్ బాలబాలికల జిల్లా టీం సెలక్షన్లు నిర్వహించారు. అండర్– 14, 17 ఎంపికలు ఎస్జీఎఫ్ సెక్రటరీ గోపి, అండర్ –19 ఎంపికలు నరసింహారావు, కోచ్ ఆఫ్రోజ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగాయి.

శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన

శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన