
జిల్లాస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
వేటపాలెం: కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి ఆటల పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు గుమ్మా శ్రీనివాసరావు శనివారం తెలిపారు. పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో శుక్రవారం జరిగిన డివిజన్ స్థాయి ఆటల పోటీల్లో పాల్గొని విజేతలగా నిలిచారని తెలిపారు. జిల్లా పోటీలకు ఎంపికై న విద్యార్థులు డిస్కస్‌త్రోలో ప్రసాద్, 5కే నడకలో సుర్యతేజ, డిస్కస్ త్రోలో జయచంద్రిక, 200 మీటర్ల పరుగు పందెంలో వెంకాయమ్మ, 400 మీటర్లు పరుగు పందెంలో రేఖ విజేతలుగా నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. కఠారివారిపాలెం స్కూల్ విద్యార్థి ఎస్. రాహుల్ జిల్లా స్థాయి ఆటల పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం పద్మావతి తెలిపారు.