ధరలు తగ్గించాలి
ధరలు తగ్గించాలి
పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి. ఒక వైపు రైతులకు సాగు ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. పండించిన పంటకు గిట్టు బాటు ధరలు లేకుండా పోయాయి. గోటి చుట్టుపై రోకటి పోటులా ప్రభుత్వాలు ఎరువుల ధరలు పెంచడం దారుణం. రైతుల పరిస్థితి దీనంగా మారింది. వ్యవసాయం చేయడం కష్టంగా ఉంది.
– నాయుడు, వేటపాలెం సాగు ఖర్చులు పెరిగాయి
ఎరువుల ధరలతోపాటు కూలి, వ్యవసాయ యంత్రాల బాడుగ ధరలు పెరిగాయి. దీంతో వ్యవ సాయం చేయడం కష్టంగా మారింది. సాగు చేసే కంటే కూలి పనులకు వెళ్లడం నయం అన్నట్లు పరిస్థితి నెలకొంది. ఉన్న భూమిని వదులుకోలేక వ్యవసాయం చేస్తున్నాం. 90 శాతం మంది రైతులు తమ భూమిని కౌలుకు ఇస్తున్నారు.
– రామకృష్ణ, రైతు, వేటపాలెం వేటపాలెం చీరాల నియోజకవర్గ పరిధిలో దాదాపు రెండు లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో ప్రధానంగా వరి, వేరుశనగ, మొక్కజొన్న, మినుము, పెసర పంటలు సాగు చేస్తుంటారు. గత ఏడాది వరికి మద్దతు ధర రాక పోవడంతో రైతులు నష్టాల బాట పట్టారు. తీరా పంట చేతికి వచ్చే సరికి ధాన్యానికి ధరలేక దళారులకు తక్కువ ధరలకే విక్రయించుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎకరా సాగు చేయడానికి రూ. 35 వేలు నుంచి రూ. 40 వేల వరకు ఖర్చు అవుతోంది. ఈ ఏడాది ఎరువులు, కూలీ ధరలు పెరడంతో సాగు ఖర్చులు మరో రూ.5 వేలు పెరిగే అవకాశం ఉంది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2019 – 24 వరకు ఎరువుల ధరలు నిలకడగా ఉన్నాయి. వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకు ఆర్‌బీ కేలను అప్పటి పాలకులు ఏర్పాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిర్వీర్యం చేసింది. యూరియా సక్రమంగా అందించలేని దుస్థితిలో ప్రస్తుత సర్కార్ ఉంది.
ఎమ్మార్పీ కంటే అధికంగా వ్యాపారుల విక్రయం
వ్యయసాయానికి భారీగా పెరిగిన పెట్టుబడులు
కూటమి ప్రభుత్వంలో పెట్టుబడి సాయం అంతంతే
ఏ పంటకీ గిట్టుబాట ధర లభించక తీవ్ర నష్టాలు
ఎరువుల ధరల వివరాలు (రూ.లలో)
20–20–0 1250 1350
10–26–26 1470 1850
15–15–15 1450 1650
14–15–14 1700 1850
పొటాష్ 1550 1800
28–28 1700 1850
20–20–0–13 1300 1450
24–24 1700 1850
డీఏపీ 1350 1350
యూరియా 266 270
నాడు అందుబాటులో..
కూటమి పాలనలో ఎరువుల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుకుంటూ పోతుండటంతో మోయలేని భారం వారిపై పడుతోంది. పెట్టుబడి సాయం అంతంత మాత్రం అందడం, గిట్టుబాటు ధర లేక నష్టాల పాలవుతున్నారు. గత ఏడాది వరి, పొగాకు, శనగ, మిర్చి, పత్తి రైతులు భారీగా నష్టాలు చవి చూశారు. ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడంతోపాటు బస్తాకు అదనంగా వ్యాపారులు కూడా దోచుకుంటున్నారు. కూటమి సర్కార్ తీరుపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రకం పాత ధర కొత్త ధర