
ఉచితంగా వైద్య సేవలు
వర్షాకాలంలో కేసులు నమోదయ్యే దృష్ట్యా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. బాధితులకు చికిత్స అందించేందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు, సైలెన్లు, అన్ని అందుబాటులో ఉంచాం. డయేరియా సోకిన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ముందస్తుగా గుర్తించి నివారణ చర్యల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అతిసార వ్యాధి బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం.
–డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ, గుంటూరు
డయేరియా సోకిన వారికి ద్రవ రూపంలో ఉండే ఆహారం అందజేయాలి. మజ్జిగ, పాలు, బార్లీ గంజి, పలచగా తయారు చేసిన సగ్గు బియ్యం, రాగి జావ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, సోయాబీన్స్ రసం, ఇతర పళ్ల రసాలు ఇవ్వొచ్చు. మలమూత్ర విసర్జన పిదప, భోజనం చేసే ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం చాలా ఉత్తమం. ఇంట్లో వైద్యాలు, మందుల షాపుల వద్దకు వెళ్లి మందులు తెచ్చుకోవడం చేయవద్దు. డయేరియా వచ్చినప్పుడు అర్హత ఉన్న వైద్య నిపుణుడి వద్దకు వెళ్లాలి.
– డాక్టర్ షేక్ నాగూర్‌బాషా,
గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, గుంటూరు

ఉచితంగా వైద్య సేవలు