
కూటమి ప్రైవేటీకరణపై ఆగ్రహ జ్వాల
చంద్రబాబు ప్రభుత్వ కుటిల వైఖరిపై వైఎస్సార్‌సీపీ నేతల మండిపాటు వైద్య కళాశాలల ప్రైవేటీకరణ కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఖండన పేద, మధ్య తరగతికి వైద్యవిద్య, ఉచిత సేవలు దూరం అవుతాయని ఆవేదన అయినవారికి దోచిపెట్టడమే చంద్రబాబు నైజమని మండిపాటు పెద్ద ఎత్తున తరలిరావాలని యువత, విద్యార్థులు, శ్రేణులకు పిలుపు
పోరాటానికి మద్దతివ్వండి
నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ
విజయవంతం చేయాలి
బాపట్ల అర్బన్/వేమూరు/అద్దంకి: కూటమి ప్రభుత్వ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వైద్య విద్య దూరం చేసేలా ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో బాపట్లలో ‘చలో మెడికల్ కళాశాల’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నటికీ ప్రైవేటు వ్యక్తులు, పెట్టుబడిదారులకు మద్దతుగా వ్యవహరిస్తుంటారని గుర్తుచేశారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఆయనకు చిన్నచూపు అని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంచి మనసుతో చేపట్టిన మెడికల్ కళాశాలల ఏర్పాటును చంద్రబాబు స్వార్థపూరిత ఆలోచనలతో నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ‘చలో మెడికల్ కళాశాల’ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు పార్టీ ఆధ్వర్యంలో ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మేరుగు నాగార్జున, నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.
మేరుగ
నాగార్జున
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ శుక్రవారం ‘చలో మెడికల్ కళాశాల’ కార్యక్రమం విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాపట్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నియోజక వర్గంలోని విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందని చెప్పారు. యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి మంచి ఆరోగ్యం అందించాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల, ప్రభుత్వ వైద్యశాల ఉండాలన్నారు. వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ చేయడమే చంద్రబాబు వైఖరి అన్నారు. వైఎస్ జగన్ తన పాలనలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. నాడు–నేడు పథకం ద్వారా ప్రతి పాఠశాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రవేటీకరణను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జడ శ్రావణ కుమార్ విజయవాడలో ధర్నా చౌక్ వద్ద గురువారం చేపట్టిన ధర్నాకు అశోక్‌కుమార్ మద్దతు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బాపట్లలో శుక్రవారం జరిగే చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని వైఎస్సార్‌సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీహెచ్ అశోక్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, విద్యార్థి, యువజన విభాగ నేతలు రావాలని పిలుపునిచ్చారు.
వరికూటి
అశోక్‌బాబు
సీహెచ్
అశోక్ కుమార్
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు బాపట్ల జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య గురువారం మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో పేదలకు వైద్య విద్య అందుబాటులోకి తేవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించాలని సంకల్పించారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఈ కాలేజీలను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది పేద పిల్లలకు వైద్య విద్యను దూరం చేయడమేనని పాలకుల తీరుపై మండిపడ్డారు. ప్రజలకు ఉచిత వైద్యం అందక అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రైవేటీకరణ వలన పేద, మధ్యతరగతి వారు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఈ అన్యాయాన్ని అడ్డుకోవడం కోసం అందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు. శుక్రవారం బాపట్ల పట్టణం రఽథం బజార్ పార్టీ కార్యాలయం నుంచి బాపట్ల మెడికల్ కాలేజీ వద్దకు శాంతియుత నిరసన ర్యాలీ చేపడతామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, వివిధ పార్టీ అనుబంధ జిల్లా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
పేద, మధ్య తరగతి వారిపై కూటమి నేతలు తమ సవతి తల్లి ప్రేమను చాటుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి వైద్య విద్య దూరం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ప్రైవేటీకరణకు తెరతీసింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తనకు కావాల్సిన వారికి ధారాదత్తం చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం మండిపడ్డారు. మాజీ మంత్రి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు, వైఎస్సార్‌సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీహెచ్ అశోక్ కుమార్, బాపట్ల జిల్లా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్యలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బాపట్లలో శుక్రవారం జరిగే కార్యక్రమానికి ప్రతిఒక్కరూ మద్దతు తెలుపుతూ తరలిరావాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రైవేటీకరణపై ఆగ్రహ జ్వాల

కూటమి ప్రైవేటీకరణపై ఆగ్రహ జ్వాల

కూటమి ప్రైవేటీకరణపై ఆగ్రహ జ్వాల

కూటమి ప్రైవేటీకరణపై ఆగ్రహ జ్వాల