
రైతులను వెంటనే ఆదుకోవాలి
మాజీ మంత్రి మేరుగ, పర్చూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి గాదె డిమాండ్ యూరియా కొరతపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైతుల నిరసన
పర్చూరు(చినగంజాం): రాష్ట్రంలో రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని, యూరియా కొరత లేకుండా చూడాలని బాపట్ల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డిలు డిమాండ్ చేశారు. ఎరువుల బ్లాక్ మార్కెట్, యూరియా కొరతపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. గాదె మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. ముందుగా పర్చూరులోని పార్టీ కార్యాలయం నుంచి గాదె ఆధ్వర్యంలో నియోజక వర్గ పరిధిలోని రైతులు, నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలు దేరి స్థానిక బొమ్మల సెంటర్‌లోని వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి రైతులంతా శాంతియుతంగా మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ పి. బ్రహ్మయ్యకు వినతి పత్రం అందజేసిన అనంతరం మాజీ మంత్రి నాగార్జున మాట్లాడారు. సీఎంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారన్నారు. వ్యవసాయం దండగ అని సలహా ఇచ్చిన చంద్రబాబు ... రైతులను ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తూ నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ వరి సాగు వలన ప్రయోజనం లేదంటూ సీఎం ఉచిత సలహాలు ఇస్తున్నారన్నారు.
బర్లీ పొగాకు రైతులకు పాట్లు
గాదె మధుసూదనరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంగా రైతులను నమ్మించి మోసగిస్తూ వస్తోందన్నారు. బర్లీ పొగాకు కొనుగోలు విషయంలో అన్నదాతలను ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ అంటూ రైతులను విడగొట్టిందన్నారు. యూరియాను కూటమి నాయకులు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ఆరోపించారు. జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, మాజీ జెడ్పీటీసీ భవనం శ్రీనివాసరెడ్డి, ఆరు మండలాల కన్వీనర్‌లు మున్నం నాగేశ్వరరెడ్డి, రావూరి వేణు, చిన్ని పూర్ణారావు, జంపని వీరయ్య చౌదరి, కఠారి అప్పారావు, పఠాన్ కాలేషావలి, ఉప్పలపాటి అనిల్, ముప్పాళ్ళ రాఘవయ్య, కొల్లా శ్రీహరి, శేషగిరి, ఎం.జగన్నాథం, జంగా అనిల్, దాసరి వెంకటరావు, తోకల కృష్ణమోహన్, వై.హరిప్రసాద్, కె. శ్రీనివాసరావు, జి. చిన్న, జె. శేషయ్య, వై. సుబ్బారెడ్డి, పి.వీరయ్య, డి.నరసింహారావు, రూబేను, బ్రహ్మారెడ్డి, వై. రామకృష్ణ, పి. ప్రకాష్, ఎ. సూరి, జి. ఉమాశంకరెడ్డి, బట్టు అనిల్ కుమార్, గోగినేని సతీష్, ఎన్.రామాంజనేయులు, బసవయ్య, మొగిలి నాగేశ్వరరావు, కె.అనిల్, వైస్ ఎంపీపీ యార్లగడ్డ సుబ్బారావు, అహ్మద్, దండా చౌదరి, గోపతోటి బాబురావు, డి. వెంకటేశ్వరరెడ్డి, బుల్లిబాబు, అట్లూరి వెంకయ్య, తమ్మలూరి సురేష్, మైలా చిననాగేశ్వరరావు పాల్గొన్నారు.

రైతులను వెంటనే ఆదుకోవాలి