పాత వారికే బార్‌ టెండర్లు | - | Sakshi
Sakshi News home page

పాత వారికే బార్‌ టెండర్లు

Sep 19 2025 1:51 AM | Updated on Sep 19 2025 1:51 AM

పాత వ

పాత వారికే బార్‌ టెండర్లు

పాత వారికే బార్‌ టెండర్లు ఎకై ్సజ్‌ పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి బౌద్ధస్తూపం ఎంతో పురాతనం సాగర్‌ ప్రాజెక్టును పరిశీలించిన కేఆర్‌ఎంబీ చైర్మన్‌

చీరాల అర్బన్‌: చీరాలలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు జరిగిన లాటరీలో నాలుగు టెండర్లు పాత వారికే దక్కాయి. గురువారం జిల్లాలోని కలెక్టరేట్‌ కాంపౌండులో పీజీఆర్‌ఎస్‌ హాలులో జాయింట్‌ కలెక్టర్‌ గంగాధర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ టెండర్ల లాటరీ డ్రా నిర్వహించారు. గతంలో ఏడు బార్లకుగాను ఒక దానికే నాలుగు టెండర్లు పడ్డాయి. మిగిలిన వాటికి రాలేదు. గడువు పెంచగా.. గురువారం ఆరు బార్‌లకుగాను నాలుగింటికి డ్రా నిర్వహించారు. ఈగల్‌, గాయత్రి, కనకదుర్గ, లహరి బార్‌ అండ్‌ రెస్టారెంట్లు అవకాశం దక్కించుకున్నాయి. కొత్తవారు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడు సార్లు టెండర్లు గడువును పెంచారు. చివరకు పాత వారే నాలుగు టెండర్లు దక్కించున్నారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.ఆయేషా బేగం, అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ బి.వెంకటేశ్వర్లు, ఎకై ్సజ్‌ అధికారులు పాల్గొన్నారు.

పర్చూరు(చినగంజాం): ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖలోని పెండింగ్‌ కేసులను సత్వరం పరిష్కరించాలని ఒంగోలు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె. విజయ అన్నారు. పర్చూరులోని స్టేషన్‌ను ఆమె గురువారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి డేటాను సమీక్షించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఒంగోలు అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌) ఎ. జనార్దన్‌, పర్చూరు ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ భుజంగరావు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం, శ్రీధర్‌ బాబు, జి. రామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

భట్టిప్రోలు: స్థానిక బౌద్ధస్తూపం ఎంతో పురాతనమైనదని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ అన్నారు. గురువారం స్తూపాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి స్తూపం ప్రపంచంలోనే మరెక్కడా లభించకపోవడం ప్రత్యేకత అన్నారు. బౌద్ధ వారసత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కేంద్ర నిధులను సమకూర్చి ఈ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయపురి సౌత్‌: కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్‌ బీపీ పాండే ఆధ్వర్యంలో సభ్యులు కేకే జాన్గిడ్‌ తదితరులతో కలిసి గురువారం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును సందర్శించారు. సాగర్‌ ప్రధాన డ్యామ్‌, గ్యాలరీలు, రైట్‌ కెనాల్‌, పవర్‌ హౌస్‌, ప్రధాన జల విద్యుత్‌ కేంద్రాన్ని పరిశీలించారు. స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రాజెక్టు అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రధాన డ్యాం, పైలాన్‌ పిల్లర్‌ పార్కులను శుభ్రపరిచారు. పార్కులో మొక్కలు నాటారు. శుక్రవారం లో లెవెల్‌ కెనాల్‌, లెఫ్ట్‌ కెనాల్‌లను సందర్శించనున్నారు. కేఆర్‌ఎంబీ ఈఈ శ్రీనివాసరావు, సాగర్‌ డ్యాం ఈఈ సీతారాం, డీఈ అశోక్‌ ఆనంద్‌, ఏఈ కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

పాత వారికే     బార్‌ టెండర్లు 
1
1/3

పాత వారికే బార్‌ టెండర్లు

పాత వారికే     బార్‌ టెండర్లు 
2
2/3

పాత వారికే బార్‌ టెండర్లు

పాత వారికే     బార్‌ టెండర్లు 
3
3/3

పాత వారికే బార్‌ టెండర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement