
కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలి
చీరాల అర్బన్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు డాక్టర్ విస్తర్ల బాబూరావు అన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు ఆదేశాలతో గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు అధ్యక్షతన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. శుక్రవారం తలపెట్టిన చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలన్నారు. ప్రైవేటీకరణను విరమించుకోకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నిర్మాణ దశలో ఉన్న కాలేజీలను త్వరగా పూర్తి చేయాలన్నారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు గోసాల అశోక్, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవ, మాజీ అధ్యక్షుడు బి.సుబ్బారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాస్టర్, మహిళా నాయకురాలు ప్రసన్న, జిల్లా మున్సిపల్ వింగ్ సభ్యుడు కంచర్ల చక్రవర్తి, మాజీ కౌన్సిలర్ చెల్లి బాబూరావు, పార్టీ నాయకులు ఎస్.నవీన్, పోతురాజు, జంగా ప్రేమ్ పాల్గొన్నారు.