
ప్రజాస్వామ్యానికి పెను ముప్పు
కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై సాక్షి దినపత్రికలో ప్రచురించారని పోలీసులు కేసులు నమోదు చేయడం తగదు. సాక్షి ఎడిటర్, విలేకరులను నిందితులుగా చూపడం హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పత్రికలపై కేసులు పెట్టి వేధించడం దారుణం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ హరించేలా కేసులు నమోదు చేయడం పెనుముప్పుకు సంకేతం. పాత్రికేయులకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలి. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. – నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే, పెదకూరపాడు

ప్రజాస్వామ్యానికి పెను ముప్పు