
పల్నాడు జిల్లాకు రెండో విడత ఎరువులు రాక
నాదెండ్ల: పల్నాడు జిల్లాకు రెండో విడతగా 1185 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులను ప్రభుత్వం కేటాయించిందని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు చెప్పారు. సాతులూరులోని రైల్వే ర్యాక్ పాయింట్‌ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడత కేటాయించిన ఎరువులను రైతులకు పంపిణీ చేశామన్నారు. రెండో విడతలో స్పిక్ యూరియా 530 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 210 మెట్రిక్ టన్నులు, డీఏపీ 445 మెట్రిక్ టన్నులు వచ్చాయన్నారు. వీటిని సొసైటీలు, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎరువులు రైతులకు సక్రమంగా అందేలా స్ధానిక వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయనవెంట జిల్లా ఏడీఏ కార్యాలయం సిబ్బంది హనుమంతరావు, శ్రీనివాసరావు, ఏఓ శ్రీలత పాల్గొన్నారు.
సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుట్‌బాల్, సెపక్ తక్రా బాల, బాలికల జట్ల ఎంపికలు బుధవారం నిర్వహించారు. ఈ ఎంపికలను ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్–19 ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.నరసింహా రావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో అండర్–19 స్కూల్ గేమ్స్ జాయింట్ సెక్రటరీ కె.పద్మాకర్, పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎ.సురేష్ కుమార్, విద్యా కేంద్రం డైరెక్టర్ నిమ్మగడ్డ చిట్టిబాబు, ప్రిన్సిపాల్ షేక్ మౌలాలి, ఫిజికల్ డైరెక్టర్ పి.శివరామకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు గండు సాంబశివరావు, బి.అనిల్ దత్త నాయక్, కోనంకి కిరణ్ కుమార్ ఫుట్‌బాల్ కోచ్‌లు పి.సురేష్, పి.వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగే రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొంటారని స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి.నరసింహారావు తెలిపారు.
సత్తెనపల్లి: ఆంధ్ర గాంధీగా పేరు తెచ్చుకున్న స్వాతంత్య్ర సమరయోధులు, సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు వావిలాల గోపాలకృష్ణయ్య ఆదర్శప్రాయుడని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వావిలాల స్మృతివనంలో బుధవారం నిర్వహించిన వావిలాల గోపాలకృష్ణయ్య 119వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మద్యపాన నిషేధం కోసం వావిలాల ఎన్నో పోరాటాలు చేశారన్నారు. సత్తెనపల్లి శాసనసభ్యుడిగా వరుసగా 1952 నుంచి 1967 వరకు నాలుగు ఎన్నికల్లో గెలుపొంది 20 ఏళ్ల పాటు పని చేశారన్నారు. డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్య జీవితం అందరికీ ఆదర్శం కావాలన్నారు. ముందుగా వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వావిలాల గోపాల కృష్ణయ్య మనవడు మన్నవ సోడేకర్, గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.

పల్నాడు జిల్లాకు రెండో విడత ఎరువులు రాక

పల్నాడు జిల్లాకు రెండో విడత ఎరువులు రాక