
ప్రైవేటుకు అప్పగిస్తే ప్రజాఉద్యమం
– కర్ణ లక్ష్యారావు,
చేనేత సొసైటీ అధ్యక్షుడు, దేశాయిపేట
బాపట్ల మెడికల్ కాలేజీని
ప్రైవేటుకు ఇవ్వొద్దు
అలా చేస్తే నాణ్యమైన
వైద్యానికి పేదలు దూరం
నిర్మాణం పూర్తిచేసి ప్రభుత్వ
ఆధ్వర్యంలో నిర్వహించాలి
గత ప్రభుత్వ హయాంలో 60 ఎకరాల్లో
స్థల సేకరణ, రూ.750 కోట్ల అంచనా
వ్యయంతో పనులు ప్రారంభం
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
బాపట్ల అర్బన్: మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిన చేపట్టడం తగదని, మెడికల్ కాలేజీ సాధన కోసం ప్రజలు, మేధావులు, ప్రజాతంత్ర వాదులు రాజకీయాలకతీతంగా జరిగే పోరాటంలో పాల్గొనాలని సీపీఎం జిల్లా కమిటీ కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. మంగళవారం పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో సీపీఎం ఆధ్వర్యంలో బాపట్ల మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్మించాలని జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీల, దళిత, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ బాపట్ల ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ పద్ధతికి బదలాయించడం తగదని, ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలు చేపట్టి నిర్వహించాలన్నారు. గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. సమావేవంలో పలువురు నేతలు మాట్లాడారు.
2021లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసి, ఇంకా పూర్తి కాని 10 వైద్య కళాశాలల్లో బాపట్ల ఒకటన్నారు. గత ప్రభుత్వ హయాంలో కళాశాలకు అవసరమైన 60 ఎకరాల స్థలం సేకరించారని, రూ.750కోట్ల వ్యయ అంచనాతో నిర్మాణం కోసం మేఘా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టెండర్ దక్కించుకుందని, గత ప్రభుత్వ హయాంలో 5శాతం పనులు మొదలయ్యాయన్నారు.
ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేయడంలో విఫలమైందన్నారు. నిధులు కేటాయింపులు చేయకపోగా ప్రైవేటుకు అప్పగించడం దారుణమన్నారు. బాపట్ల ప్రాంతవాసుల చిరకాల వాంఛగా ఉన్న వైద్య కళాశాల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.
పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులను భాగస్వాములను చేస్తే వైద్య విద్య పేదలకు దూరం అవుతుంద వక్తలు అభిప్రాయపడారు. ఈ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు సంభవించినపుడు, గుండెజబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అత్యవసర వైద్యం కోసం కిలోమీటర్లు దూరంలోని గుంటూరు, విజయవాడ వెళ్లవలసిన తరుణంలో ఎందరో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయని తెలిపారు.
మెడికల్ కాలేజీ సాధన కోసం జరిగే పోరాటాలలో ప్రజలందరూ రాజకీయాలకతీతంగా పాల్గొనాలన్నారు. వైద్య కళాశాల నిర్మాణం పీపీపీ పద్ధతిన ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే యత్నాలను పక్కన బెట్టి రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం, నిర్వహణ భాద్యతలు చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వామపక్ష పార్టీలు, దళిత ప్రజాసంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు మేకల ప్రసాద్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు గొర్ల శ్రీనివాసరావు, బీఎస్పీ నాయకుడు జి.రాజారావు దళిత, ప్రజాసంఘాల నాయకులు టి.కృష్ణమోహన్, పి.కొండయ్య, సీహెచ్ మనిలాల్, కె.శరత్, వినయ్ కుమార్, ఆర్ చంద్రశేఖర్, సిహెచ్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటుకు అప్పగిస్తే ప్రజాఉద్యమం