పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు
పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్న మీడియా రంగాన్ని కూటమి ప్రభుత్వం అణచివేసేలా చర్యలు చేపట్టడం సరికాదు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. చేస్తున్న మోసాలను, వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తుందనే ‘సాక్షి’ ఎడిటర్, విలేకరులపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణం. ప్రభుత్వ తప్పులను తప్పుగా పత్రికలు ఎత్తిచూపడాన్ని పాలకులు ఓర్చుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్యంలోని నాలుగో స్తంభంగా పరిగణింపబడే మీడియాపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం.
– ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), మాజీ ఎమ్మెల్యే,మంగళగిరి
నాడు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు మూరల చీర నేసిన మన చేనేత వైభవం, విశిష్టత.. సముద్రాలు దాటి విస్తరించగా.. నేడు నేతన్నల జీవితాలు కష్టాల కడలిలో చిక్కుకున్నాయి. నాడు దేశమంతటికీ వస్త్రాలు అందించిన నేతన్న .. నేడు భుక్తి కోసం ఇతర పనులు వెదుక్కొనే దుస్థితి దాపురించింది. ఈ దశలో చేనేతకు చేయూతనందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపడంతో నేతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సర్కారు నుంచి రావాల్సిన మొండి బకాయిలు చేనేత సొసైటీల ఉసురు తీస్తున్నాయి. ఈక్రమంలో నిత్యం మగ్గాల సవ్వడితో సందడిగా ఉండే చేనేత కాలనీల్లో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది.
1/2
పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు
2/2
పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు