
ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నడపాలి
చీరాల అర్బన్: ఆర్టీసీలో రాబోతున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ఆర్టీసీనే నిర్వహించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ చీరాల డిపో అధ్యక్షుడు ఏబీకే రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆవిర్భావం సభ మంగళవారం చీరాలలో నిర్వహించారు. సందర్భంగా కార్యాలయం వద్ద పతాకావిష్కరణ చేశారు. పలువురు వక్తలు మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా కార్మికులంతా ఆర్టీసీ రక్షణకు సిద్ధం కావాలన్నారు. ఆర్టీసీలో రద్దీకి అనుగుణంగా నూతన నియామకాలు చేయాలన్నారు. మెరుగైన టిమ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణ కార్యదర్శి ఎం.వసంతరావు మాట్లాడుతూ సీఐటీయూ అనుబంధ సంస్థ ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆవిర్భావం తర్వాతనే అనేక ఐక్య ఉద్యమాలు ఆర్టీసీలో జరిగాయని గుర్తు చేశారు. ఆర్టీసీలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ని బలమైన సంఘం నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో తులసిరావు, రాంబాబు, రామ్మోహనరావు, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, బాషా, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌డబ్ల్యూఎఫ్ చీరాల డిపో అధ్యక్షుడు
ఏబీకే రెడ్డి డిమాండ్