
రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
చీరాల రూరల్ : స్థానిక రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్–1 ఉత్తరం వైపు చివరన ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని జీఆర్పీ ఎస్‌ఐ సీహెచ్. కొండయ్య తెలిపారు. 55 సంవత్సరాలు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ప్లాట్‌ఫాంపై పడున్నాడనే సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే మరణానికి కారణాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రైలు నుంచి జారిపడి మరొకరు
రైల్లో ప్రయాణిస్తూ జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చీరాల–వేటపాలెం రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. విజయవాడ వైపు వెళ్లే డౌన్ మెయిన్ లైన్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో పరీక్షించగా ఎటువంటి అధారాలు లభించలేదని ఎస్‌ఐ కొండయ్య తెలిపారు. మృతుని వయస్సు 45 సంవత్సరాలు ఉంటాయని చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి