
ఎయిడ్స్‌పై అవగాహనకు మొబైల్ వాహనం
నరసరావుపేట: అవగాహన కోసం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లాకు అందజేసిన మొబైల్ ఐఈసీ వాహనం ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో వాహనానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ మొబైల్ వాహనం ద్వారా ప్రజలకు వ్యాధిపై అవగాహన పెంచుతామన్నారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ వాహనాన్ని జిల్లాకు కేటాయించినందుకు సంస్థకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం మేనేజర్ జానీబాషా, క్లస్టర్ ప్రెవెన్షన్ ఆఫీసర్ కిరణ్‌కుమార్, ఐసీటీసీ కౌన్సిలర్ రవి, పీపీటీసీటీ కౌన్సిలర్ జ్యోతి సిబ్బంది పాల్గొన్నారు.