
పెండింగ్ కేసులపై దృష్టి పెట్టండి !
బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు
బల్లికురవ: పెండింగ్ కేసులపై దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు ఆదేశించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఆయన పలు రికార్డులను పరిశీలించారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల వారీగా రౌడీ షీటర్ల కదలికలపై దృష్టి పెట్టాలని ఎస్‌ఐ వై. నాగరాజును ఆదేశించారు. శాంతిభద్రతలను నిత్యం పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. గ్రానైట్ క్వారీల్లో ప్రమాదాలు జరగకుండా యజమానులను అప్రమత్తం చేయాలని తెలిపారు. క్వారీలో నిబంధనలు, భద్రతా చర్యలతో పాటు, బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వ చేసుకునేందుకు మ్యాగ్‌జైన్‌లు ఏర్పాటు చేసుకునేలా యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. రవాణా కోసం అనుభవం లేని, హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌లు లేని వారిని నియమించుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టాలని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సంతమాగులూరు సీఐ కె.వెంకటరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.