
రోడ్డుపై విరిగిపడిన శతాబ్ది మర్రి చెట్టు
ఇంకొల్లు(చినగంజాం): ఇంకొల్లు– పావులూరు రోడ్డులో నాగులు చెరువు కట్టపై ఉన్న 100 సంవత్సరాల నాటి భారీ మర్రి చెట్టు కొమ్మలు శుక్రవారం హఠాత్తుగా విరిగి పడ్డాయి. అయితే, ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై చెట్టు కొమ్మలు విరిగి పడటంతో పూర్తిగా మూసుకుపోయింది. సాయంత్రం మూడు గంటల నుంచి ట్రాఫిక్ స్తంభించింది. సమాచారాన్ని అందుకున్న ఇంకొల్లు గ్రామ పంచాయతీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి అడ్డగడ వెంకటేశ్వర్లు చెట్టు కొమ్మలను తొలగింపజేసి జలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 6 గంటల తరువాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.