
ఐదు కిలోల గంజాయి స్వాధీనం
మార్టూరు: బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పర్చూరు ఎకై ్సజ్ ఎస్‌ఐ శ్రీధర్ కథనం మేరకు... గంజాయి తరలిస్తున్నారనే ముందుస్తు సమాచారంతో స్టేట్ టాస్క్‌ఫోర్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సీహెచ్ మధుబాబు, ఏఈఎస్ జనార్దన్, టాస్క్‌ఫోర్స్ సీఐ బాల నరసింహ, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు ఆర్. నరహరిరావు, ఎస్. రామారావు, పర్చూరు ఎకై ్సజ్ ఎస్‌ఐ శ్రీధర్ తమ సిబ్బందితో కలిసి అర్ధరాత్రి బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద నిఘా పెట్టారు. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి తిరుపతి వెళుతున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సురేష్ మహాపాత్రో అనే వ్యక్తి నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోనికి తీసుకున్నారు. అధికారులు పర్చూరు ఎకై ్సజ్ కార్యాలయానికి నిందితుడిని తరలించి, విచారించారు. సురేష్ మహాపాత్రో తన సమీప బంధువైన విశాల్ బుట్కీ దగ్గర కేజీ రూ. 3 వేల చొప్పున 5 కిలోలు కొనుగోలు చేశాడు. చైన్నెలో కిలో రూ.10 వేల చొప్పున విక్రయించేందుకు తరలిస్తున్నట్లు అంగీకరించాడు. ఇప్పటికే చైన్నెలో ఇతనిపై రెండు కేసులు నమోదు కాగా, గతంలో జైలు జీవితం గడిపి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.