
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
చీరాల అర్బన్: హత్య కేసులో నిందితుడిని గురువారం చీరాల టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు టూటౌన్ సీఐ నాగభూషణం గురువారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. చీరాల హారిస్‌పేటకు చెందిన పేర్లి కోటేశ్వరరావు ఈనెల 4వ తేదీన అతని ఇంటి వద్ద అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై అతని భార్య పేర్లి ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన సలగల విజయ్‌బాబు హారిస్‌పేట వీఆర్వో ద్వారా పోలీస్‌స్టేషన్‌లో గురువారం లొంగిపోయాడు. మృతుడు తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, అలాగే తన భార్య ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి సహకరిస్తుండడంతో ఈనెల 3వ తేదీ రాత్రి పేర్లి కోటేశ్వరరావును హత్య చేసినట్లు అంగీకరించాడు. సమావేశంలో ఎస్సై వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
వివాహేతర సంబంధమే హత్యకు కారణం