
చెన్నుపల్లికి విశ్వకర్మ ఐకాన్ జాతీయ పురస్కారం
అద్దంకి: పట్టణానికి చెందిన చెన్నుపల్లి శ్రీనివాసాచారి విశ్వకర్మ ఐకాన్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈ మేరకు తనకు వారి నుంచి ఉత్తర్వులు అందాయని మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విశ్వబ్రాహ్మణ సంఘంలోని వారు ఎవరూ వైద్యానికి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మూడు సంవత్సరాల నుంచి శ్రీనివాసాచారి వైద్యసేవలు అందేలా చూస్తున్నాడు. దీనికిగానూ 2025 విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పురస్కారం అందజేయనున్నారు.