
కదం తొక్కిన కర్షకలోకం
●అన్నదాత పోరు.. జన హోరు
●కూటమి ప్రభుత్వంపై అన్నదాతల ఆగ్రహం
●భారీగా కలెక్టరేట్‌కు చేరుకున్న రైతులు
●రైతన్నకు అండగా వైఎస్సార్ సీపీ
బాపట్ల: రైతన్నకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి భారీగా రైతులు తరలి వచ్చారు. ట్రాక్టర్లతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి రైతులు వచ్చి కనీసం యూరియా కూడా అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, బాపట్ల సమన్వయకర్త కోన రఘుపతిలు ర్యాలీలో పాల్గొని రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని అభయమిచ్చారు. బాపట్ల నియోజకవర్గంలో కోన రఘుపతి పిలుపు మేరకు ప్రతి గ్రామం నుంచి ట్రాక్టర్లపై రైతులు బాపట్లకు చేరుకున్నారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ వరకు రైతులు పాదయాత్రగా వెళ్ళారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రదర్శనలో పాల్గొన్ని తమ నిరసన తెలియజేశారు.
భారీగా మోహరించిన పోలీసులు
వైఎస్సార్ సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి భారీగా రైతులు చేరుకుంటున్నారని తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. డీఎస్పీ రామాంజనేయులు, సీఐ రాంబాబు ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అడుగడుగునా పోలీసులు ప్రదర్శనను అడ్డుకున్నారు. రైతులు పోలీసులను సైతం లెక్క చేయకుండా తమ నిరసన గళాన్ని వినిపించారు. కలెక్టరేట్‌లోకి పంపకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనంతరం ఆర్డీఓ గ్లోరియాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకులు కె.వి.ప్రసాద్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఈద శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సు ధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి, గవిని కృష్ణమూర్తి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, రాష్ట్ర కార్యదర్శులు చేజర్ల నారాయణరెడ్డి, నక్కా వీరారెడ్డి, మండే విజయ్‌కుమార్, చల్లా రామయ్య, వడ్డిముక్కల డేవిడ్, చింతల రాజశేఖర్, ఇనగలూరి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

కదం తొక్కిన కర్షకలోకం