
ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారు
నాలుగు ఎకరాల్లో సాగు చేశాను. వెద పద్ధతిలో నాటి ఇప్పటికే 35 రోజులు అయ్యింది. ఒక్కసారి కూడా యూరియా వేయలేదు. పైర్లు ఎదుగుదల లేక జిగటబారిపోయాయి. యూరియా కోసం బాపట్ల, చీరాలలోని ఎరువుల దుకాణాలకు తిరిగినా ప్రయోజనం లేదు. గ్రామానికి యూరియా వచ్చిందని తెలిసి ఇక్కడికి వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచి ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారు.
– మున్నం కొండలురెడ్డి, బసివిరెడ్డిపాలెం
రైతులంటే ప్రభుత్వానికి చులకన
ఆదివారం యూరియా ఇస్తున్నారని తెలుసుకొని పొలం పాసుబుక్ జిరాక్స్, ఆధార్‌కార్డు తీసుకొని ఉదయం 9 గంటలకే వచ్చా. అధికారులు 10 గంటలకు వచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉన్నాం. ఎండలు భగభగ మండిపోతున్నా కనీసం సమీపంలో తాగునీరు, నీడ వసతి కూడా లేదు. మండుటెండలో అల్లాడిపోయాం. రైతులను ఇంత చులకనగా చూడటం సరికాదు. అవసరమైన యూరియా అందరికీ సరిపడా అందజేయాలి. – బుర్ల కోటేశ్వరావు, దేవినూతల

ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారు