అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్‌ దురుసు ప్రవర్తన | - | Sakshi
Sakshi News home page

అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్‌ దురుసు ప్రవర్తన

Sep 9 2025 1:41 PM | Updated on Sep 9 2025 1:41 PM

అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్‌ దురుసు ప్రవర్తన

అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్‌ దురుసు ప్రవర్తన

అద్దంకి రూరల్‌: అద్దంకి వ్యవసాయశాఖ మార్కెట్‌ యార్డులో ప్రతి ఆదివారం సంత నిర్వహిస్తూ ఉంటారు. కూరగాయాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలు ద్విచక్ర వాహనాలను ఎవరికీ అడ్డం లేకుండా అక్కడే ఉన్న అగ్నిమాపక శాఖ కార్యాలయానికి రెండు వైపులా పెడుతుంటారు. అయితే, ఈ మధ్యనే కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆ శాఖ కానిస్టేబుల్‌ ఆదివారం సంతకు వచ్చిన ప్రజలను ద్విచక్ర వాహనాలు పెట్టవద్దని హెచ్చరించ సాగాడు. ఆఫీస్‌కు అడ్డంలేకుండా పెట్టకుంటామన్న వినలేదు. సంతకు వచ్చిన ఓ వ్యక్తిని బండ బూతులు తిడుతూ ‘‘చొక్కా విప్పితే నీకంటే పెద్ద రౌడీనిరా’’ అంటూ రెచ్చిపోయాడు. అక్కడే ఉన్న ఎస్‌ఐ వెంకట్రావు, తోటి సిబ్బంది వారించినా లెక్క చేయకుండా దూషిస్తూనే ఉన్నాడు. ఈ విషయంపై ఎస్‌ఐ వెంకటరావును వివరణ కోరగా కానిస్టేబుల్‌ ప్రవర్తనపై ఉన్నతాధికారులకు తెలియజేనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement