భట్టిప్రోలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. డాక్టర్ వైఎస్సార్ సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో ఎరువులు అందించడంతోపాటు పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో ఘోరంగా విఫలమైనట్లు విమర్శించారు. యూరియాను కూటమి నాయకులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 9న రేపల్లె ఆర్డీవో కార్యాలయంలో రైతులతో కలసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అన్నదాత పోరు కార్యక్రమంలో రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలోని రైతులు, కౌలు రైతులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అశోక్‌బాబు పిలుపునిచ్చారు.
వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు