సంతమాగులూరు (అద్దంకి రూరల్): మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన ధనుకృతి ఇన్విటేషనల్ షాడోకాన్ కరాటే చాంపియన్‌షిప్‌లో పతకం సాధించింది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఆదివారం జరిగిన అండర్ 11 కేటగిరీ కడా ఈవెంట్‌లో బంగారు పతకం సాధించినట్లు కోచ్ అఖిల్ తెలిపారు. పోటీల్లో తెలంగాణ నుంచి 350 మంది పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.
రూ.1.40 లక్షలు పలికిన లడ్డూ
సంతమాగులూరు (అద్దంకి రూరల్): మండలంలోని ఏల్చూరు పాటిమీద ఏర్పాటు చేసిన వినాయక పందిరిలోని శివ లింగాకారంలో ఉన్న లడ్డూకు అధిక ధర పలికింది. తొమ్మిది రోజులు నిత్యం పూజలందుకుని ఆదివారం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తోట ఆంజనేయస్వామి ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. ఏల్చూరుకు చెందిన నారదాసు వెంకయ్య కుమారుడు శ్రీనివాసరావు రూ.1.40,000కు పాట పాడి, లడ్డూను దక్కించుకున్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు గవర్నర్‌కు ఆహ్వానం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవిని కలసి ఆహ్వానించినట్లు పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటన లో పేర్కొన్నారు. తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూర్, మధురై, చైన్నె, తంజావూర్, సేలం, తిరుత్తణి, కంచి, చిదంబరం ప్రాంతాల నుంచి తెలుగు మహాసభలకు తెలుగు ప్రజలు హాజరు కానున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. జనవరి 3వ తేదీన ఉదయం 10గంటలకు జ రిగే మహాసభల ప్రారంభోత్సవ సభకు విశిష్ట అతిథిగా పాల్గొని తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తమిళనాడు గవర్నర్ సు ముఖత చూపారని గజల్ శ్రీనివాస్ తెలిపారు.