యూరియా.. ఇవ్వండయ్యా..! | - | Sakshi
Sakshi News home page

యూరియా.. ఇవ్వండయ్యా..!

Sep 9 2025 1:32 PM | Updated on Sep 9 2025 1:32 PM

యూరియ

యూరియా.. ఇవ్వండయ్యా..!

మరుప్రోలువారి పాలెంలో రైతుల

పడిగాపులు

చెట్ల కిందే గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి

రోజురోజుకు తీవ్రం అవుతున్న యూరియా ఇబ్బందులు

కొందరికే ఇవ్వడంతో మిగతా వారికి తప్పని ఇక్కట్లు

ఆయకట్టు 3 వేల ఎకరాలు.. వచ్చింది 200 బస్తాలే

ఎకరాకు అరకట్ట చొప్పున ఇచ్చినా 1,500 బస్తాలు అవసరం

కూటమి సర్కార్‌ తీరుపై రైతులు

తీవ్ర ఆగ్రహం

కూటమి పాలనలో అన్నదాతలకు తప్పని కష్టాలు
రైతులకు యూరియా వ్యథలు తీరడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు మొదలైన నాటి నుంచి ఏదో ఒక సమస్య అన్నదాతలను వెంటాడుతూనే ఉంది. సాగు ప్రారంభంలో సకాలంలో నీరు లేక పైర్లు ఎండిపోయాయి. కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పైర్లు మొత్తం దెబ్బతిన్నాయి. వర్షపు నీరు బయటకు పంపి ఉన్న పైర్లకు తోడు బయట ప్రాంతాల నుంచి సెంటు నారు రూ. 2 వేల నుంచి రూ.2,500 చొప్పున తెచ్చి నాటారు. ఇప్పుడు కూటమి పాలకుల దెబ్బకు యూరియా కూడా దొరకడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు కన్నీళ్లే మిగిలాయి.

బాపట్ల టౌన్‌: మండలంలోని మరుప్రోలువారిపాలెం ఎరువుల గోదాము వద్ద రైతులు ఆదివారం యూరియా కోసం ఆగ్రహంతో రగిలిపోయారు. యూరియా గోడౌన్‌కు చేరిందన్న విషయం తెలుసుకున్న ఆ ప్రాంత పరిధిలోని మరుప్రోలువారిపాలెం, మద్దిబోయినవారిపాలెం, ఇమ్మడిశెట్టివారిపాలెం, దేవినూతల, బసివిరెడ్డిపాలెం, హనుమాన్‌నగర్‌, అసోదివారిపాలెం, పోతురాజుకొత్తపాలెం గ్రామాల్లోని రైతులు ఆదివారం ఉదయం 9 గంటలకే అక్కడికి చేరుకున్నారు. అధికారులు ఉదయం 10 గంటల నుంచే పంపిణీ ప్రారంభించారు. రైతులు ఒక్కసారిగా రావడంతో అదుపు చేసేందుకు వ్యవసాయశాఖ సిబ్బంది కష్టపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు వచ్చి రైతులు కంట్రోల్‌ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పంపిణీ చేసినా అందరికీ ఇవ్వలేకపోయారు. మిగతా రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు.

సరిపడా రాని యూరియా

మరుప్రోలువారిపాలెం రెవెన్యూ గ్రామం పరిధిలోని మరుప్రోలువారిపాలెం, బసివిరెడ్డిపాలెం, పోతురాజుకోత్తపాలెం, అసోదివారిపాలెం, దేవినూతల, మద్దిబోయినవారిపాలెం, ఇమ్మడిశెట్టివారిపాలెం, హనుమాన్‌నగర్‌, మచ్చావారిపాలెం, చింతావారిపాలెం, కొత్తమద్దిబోయినవారిపాలెం, బొర్రావారిపాలెం, పల్లిపాలెం తదితర గ్రామాల్లో కలిపి మొత్తం 3,200 ఎకరాల సాగు భూమి ఉంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని రైతులు వెద పద్ధతిలో సాగు చేసి నెల దాటిపోయింది. ఇలా సాగు చేసిన 20 రోజులకే ఎకరాకు అర బస్తా, 40 రోజులకు మరో అర బస్తా చొప్పున యూరియా వేయాలి. ఒక్క మరుప్రోలువారిపాలెం రైతు సేవా కేంద్రం పరిధిలోని అన్నదాతలకే కనీసం 3 వేల బస్తాల యూరియా అందిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ముత్తాయపాలెంకు 230, మరుప్రోలువారిపాలెంకు 220 బస్తాల చొప్పున అందజేశారు. యూరియా బయట షాపుల్లో కూడా దొరక్కపోవడంతో రైతులు ఆదివారం ఆయా గ్రామాల నుంచి వందల సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా గోడౌన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేశారు. గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ యూరియా సరిపడా అందకపోవడం, పంపిణీ కేంద్రాల వద్ద కనీసం తాగునీరు, నీడ కూడా కల్పించకపోవడంతో రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

జిల్లా అధికారుల పరిశీలన

విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ వెంటనే వెళ్లి పరిస్థితి చక్కబెట్టాలంటూ జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో పి. గ్లోరియా, జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయశాఖాధికారి కె.అన్నపూర్ణమ్మ, తహసీల్దార్‌ షేక్‌ సలీమా, ఏడీఏ, ఏవో కె. శారదలు గ్రామానికి చేరుకున్నారు. మరో లోడు తెప్పించి ఇస్తామని రైతులకు నచ్చచెప్పారు.

యూరియా.. ఇవ్వండయ్యా..! 1
1/1

యూరియా.. ఇవ్వండయ్యా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement