
అప్పాపురం ఛానల్‌లో మునిగి యువకుడు మృతి
చేబ్రోలు: వినాయక విగ్రహ నిమజ్జనం కోసం వచ్చి అప్పాపురం ఛానల్‌లో ఈత కోసం దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగి యువకుడు మృతిచెందిన సంఘటన చేబ్రోలులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నల్లచెరువు గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఎం. శైలేష్ (18) స్నేహితులతో కలిసి గురువారం రాత్రి గుంటూరు నుంచి చేబ్రోలు కొమ్మమూరు చానల్‌లో నిమిజ్జనం కోసం బయలుదేరారు. మార్గంమధ్యలో అప్పాపురం ఛానల్ వద్ద మృతుడు శైలేష్ అతనితోపాటు మరో ఇరువురు స్నేహితులు ఆగి ఛానల్‌లో ఈత కోసం దిగారు. కొంత సేపు తరువాత అతని స్నేహితులు వరుణ్, షన్నులు ౖైశెలేష్ అప్పాపురం ఛానల్‌లో గల్లంతైన విషయాన్ని గమనించి కుటుంబసభ్యులకు తెలియజేశారు. రాత్రి సమయంలో గాలించినప్పటికి ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం ఛానల్ నీటి పరిమాణం తగ్గించి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టడంతో మునిగిపోయిన కొంతదూరంలో మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వీరనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నార
వైఎస్సార్‌సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి
డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్