
కుదేలైన ఇటుక పరిశ్రమ
న్యూస్‌రీల్
గిట్టుబాటు కావడంలేదు
20 ఏళ్లకు పైనుంచి ఇటుక బట్టీ నడుపుతున్నాను. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకున్నాం. కానీ నేడు ఒక ఇటుక తయారీకి రూ.6.50 పడుతోంది. దీంతో నష్టాలు తప్పడం లేదు. ఈ సంవత్సరం బట్టీ మూత వేద్దామని నిర్ణయించుకున్నా.
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
● మైలవరం ఇటుక రాకతో
పడిపోయిన ధరలు
● బట్టీల్లో మూలుగుతున్న
కోట్లాది ఇటుకలు
● మూతపడే స్థితిలో బట్టీలు
● ఉపాధి కోల్పోనున్న వేలాది
మంది కూలీలు
● గతంలో 250.. ప్రస్తుతం 65 బట్టీలు
అద్దంకి: రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో నాణ్యతతో గిరాకీ ఉన్న అద్దంకి ఇటుక పరిశ్రమ మూడపడే స్థితికి చేరుకుంది. మైలవరం ఇటుక తక్కువ ధరకే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు దిగుమతి అవుతోంది. దీంతో స్థానికంగా తయారయ్యే ఇటుక బట్టీల్లోనే మూలుగుతోంది. గతంలో వెయ్యి ఇటుక రూ.6,500 నుంచి రూ.7వేలు పలుకగా ప్రస్తుతం రూ.5,500 నుంచి రూ.6వేలకు పడిపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలు లేకపోవడం కూడా ఒక కారణమేనని చెబుతున్నారు. దీంతో ఈ సంవత్సరం పది బట్టీలు మూతపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
నాణ్యమైన ఇటుక
ఇక్కడి ఇటుక నాణ్యతకు పెట్టింది పేరు. ఎంతంటే ఒకప్పుడు నాణ్యతకు పేరుగాంచిన కరవది ఇటుక కన్నా నాణ్యతగా తయారు చేస్తారు. తెల్ల మట్టి, నల్ల మట్టిని కలిపి, అందులో వరిపొట్టు, బూడిద కలిపి పాకం చేసిన ఇటుకలుగా కోస్తారు. ప్రస్తుతం బరువు తగ్గడం కోసం ప్‌లైయాస్‌ను కూడా వినియోగిస్తున్నారు. దాంతో ఇటుక చాలా గట్టిగా ఉంటుంది.
తక్కువ ధరకే మైలవరం ఇటుక
విజయవాడ సమీపంలోని మైలవరంలో తయారయ్యే ఇటుక తక్కువ ధరకే లభిస్తుండడంతో ఇళ్ల నిర్మాణదారులు అటు వైపు ఆసక్తి చూపుతున్నారు. అక్కడి ఇటుక వెయ్యి బాడుగుతో కలుపుకుని రూ.6 వేలకు లభిస్తోంది. స్థానిక బట్టీల్లో తయారయ్యే ఇటుక ప్రాంతాన్ని బట్టి వెయ్యి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. మైలవరం ఇటుకకు, స్థానిక బట్టీల్లో తయారయ్యే ఇటుక ధరలో భారీ వ్యత్యాసం ఉండడంతో నిర్మాణదారులు మైలవరం ఇటుక వైపు మొగ్గు చూపుతున్నారు.
ఉపాధి కోల్పోనున్న వేలాది మంది కూలీలు
స్థానికంగా తయారయ్యే ఇటుకకు ఆదరణ తగ్గడంతో పరిశ్రమ మూతపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయా బట్టీల్లో పనిచేసే వేలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉభయగోదావరి, విశాఖపట్నంతో పాటు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది కూలీలు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు.
–వీరరాఘవులు, బట్టీ యజమాని

కుదేలైన ఇటుక పరిశ్రమ

కుదేలైన ఇటుక పరిశ్రమ