
మహిళా కూలీ మృతి
బల్లికురవ – సంతమాగులూరు ఆర్ అండ్ బీ రోడ్డులో ఈర్ల కొండకు సమీపంలో రోడ్డు మార్జిన్‌లో సుబాబుల్ కర్ర లోడు చేసుకుంటున్న ట్రాక్టర్ ట్రక్కును గ్రానైట్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహిళా కూలీ జొన్నలగడ్డ మేరమ్మ (53) తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కూలీలు కొత్తపల్లి ఏసమ్మ, గంధం మేరమ్మ, పందిరి చిన్న సుబ్బయ్య వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. లారీ యజమాని మాత్రం మృతి చెందిన కూలీకి రూ. 3.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందించి చేతులు దులుపుకున్నారు.