
సీజనల్ వ్యాధుల విషయంలో జాగ్రత్త
● అధికారులతో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ● నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశం
బాపట్ల: సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాల నివారణకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు. ప్రణాళిక ప్రకారం ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని తెలిపారు. నగరం మండలంలో, ఈదుపల్లి గ్రామంలో డెంగీ బాధితుడు మృతి చెందిన విషయాన్ని గుర్తుచేశారు. డెంగీ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇల్లు, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఇంట్లోని నీటి డ్రమ్ములు, ఇతరాలపై మూతలు ఉండేలా చూడాలని చెప్పారు. ఈ మేరకు ప్రజలకు కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డీపీఓ ప్రభాకర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అనంతరాజు, మండల ప్రత్యేక అధికారులు, డీఎల్‌డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
నేడు మంగళగిరిలో
సీఎం పర్యటన
మంగళగిరి టౌన్: మంగళగిరి నగర పరిధిలోని ఆటోనగర్‌లో ఉన్న వీవర్స్ శాల వద్ద జరుగనున్న జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ వీవర్స్ శాల ఎదురుగా ఏర్పాటు చేయనున్న ప్రజావేదిక వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు. వారికి పలు సూచనలు చేశారు. సంయుక్త కలెక్టర్ భార్గవతేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, అడిషనల్ ఎస్పీ రవికుమార్, డీఎఫ్‌ఓ కృష్ణారెడ్డి, హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ జేడీ రాజారావు, మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అక్టోబరులో కృత్రిమ చేతులు పంపిణీ
మంగళగిరి టౌన్: మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో ఉచిత కృత్రిమ చేతులు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు క్లబ్ అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ తెలిపారు. మంగళగిరి నగర పరిధిలోని వీటీజేఎం డిగ్రీ కళాశాలలో బుధవారం దీనికి సంబంధించి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ అక్టోబర్ 13 నుంచి 17వ తేదీ వరకు డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అధునాతన సాంకేతికతతో జర్మనీ దేశంలో కృత్రిమ చేతులు తయారు చేయించి ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ రామ్‌ప్రసాద్, ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్ చక్రవర్తి, అన్నే రత్నప్రభాకర్, సెక్రటరీ నిరంజన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ డెల్టాకు 8,004 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 8,004 క్యూసెక్కులు బుధవారం విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజ్ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్ కాలువకు 300, బ్యాంక్ కెనాల్‌కు 1,917, తూర్పు కాలువకు 722, పశ్చివ కాలువకు 286, నిజాపట్నం కాలువకు 463, కొమ్మూరు కాలువకు 3,160, బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 25,375 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు

సీజనల్ వ్యాధుల విషయంలో జాగ్రత్త

సీజనల్ వ్యాధుల విషయంలో జాగ్రత్త

సీజనల్ వ్యాధుల విషయంలో జాగ్రత్త