
అశోక్‌బాబు దీక్ష ఫలితం.. రైతన్నల హర్షం
కొనసాగుతున్న కాల్వల పూడికతీత పనులు
భట్టిప్రోలు: భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి నుంచి కనగాల అప్లాండ్ – గూడవల్లి గంగోలు కాల్వలో పేరుకుపోయిన చెట్లు, గుర్రపు డెక్క, తూటికాడ తొలగింపు చర్యలు గురువారం కూడా కొనసాగాయి. వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు అకుంఠిత దీక్షతో యుద్ధ ప్రాతిపదికన మురుగునీటి కాల్వ పనులు కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల పాటు రైతన్నల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన అశోక్‌బాబు దీక్ష ఫలితమే రైతుల పాలిట వరంగా మారింది. ఎన్నో ఏళ్ల తరబడి నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించింది.