
గోవాడలో వరలక్ష్మి శ్రీ పార్వతి అమ్మవారికి విశేష పూజలు
అమృతలూరు(భట్టిప్రోలు): శైవ క్షేత్రమైన అమృతలూరు మండలం గోవాడలో కొలువైన శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో వరలక్ష్మి శ్రీ పార్వతి అమ్మవారికి ప్రత్యేక విశేష పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం పురస్కరించుకుని దేవాలయంలో కార్యనిర్వాహణాధికారి బి.అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో వేద పండితులు స్వర్ణ శ్రీనివాస శర్మ, అర్చకులు చావలి శ్రీధర్ శర్మ, పొన్నపల్లి సత్యనారాయణ విశేష పూజలు చేశారు. భక్తులు స్వామి వారు, అమ్మ వారిని దర్శించుకుని తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.
పందిళ్లపల్లిలో
మూడు డెంగీ కేసులు
వేటపాలెం: పందిళ్లపల్లిలో మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు పెద్దలు, ఒక బాలిక జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గ్రామాన్ని ఆర్‌డీఓ చంద్రశేఖర్ నాయుడు, మండల ప్రత్యేక అధికారి రామ కృష్ణ శుక్రవారం పరిశీలించారు. కేసులు నమోదైన వీధుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. మెడికల్ క్యాంపులు, ఫీవర్ సర్వే నిర్వహించాలని సూచించారు. ఇన్‌చార్జి తహసీల్దార్ గోపీకృష్ణ, ఎంపీడీఓ రాజేష్, ఈఓపీఆర్‌డీ శ్రీనివాసరావు, డాక్టర్ జైకుమార్, పంచాయతీ కార్యదర్శి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

గోవాడలో వరలక్ష్మి శ్రీ పార్వతి అమ్మవారికి విశేష పూజలు