
రోడ్డు ప్రమాదంలో ఇన్‌కం టాక్స్ అధికారి మృతి
జే.పంగులూరు: డివైడర్‌ను ఢీకొని రోడ్డు ప్రమాదంలో ఇన్‌కం టాక్స్ అధికారి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని జాగర్లమూడివారిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. హైవే పోలీసుల వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన దాసరి కృష్ణచైతన్య (46) గుంటూరులోని ఇన్‌కం టాక్స్ ఆఫీసులో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం ఒంగోలులోని తన మామయ్య ఇంటి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఒంగోలు నుంచి గుంటూరుకు తన స్కూటీపై వెళ్తున్నారు. జాతీయ రహదారిపై జాగర్లమూడివారిపాలెం వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కృష్ణచైతన్య తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు.