
మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి ప్రతినిధి,బాపట్ల: ఫీజు రీయింబర్స్‌తో పేద, మధ్యతరగతి ప్రజల బిడ్డలను ఉన్నత చదువులు చదివించారు. ఆరోగ్యశ్రీతో పేదలకు ఉచిత వైద్యం అధించాడు. లక్షల్లో ఖర్చయ్యే గుండె ఆపరేషన్లను సైతం రూపాయి ఖర్చులేకుండా చేశారు. జలయజ్ఞంతో సాగునీటి పథకాలు తెచ్చారు. ఉచిత విద్యుత్ అందించి అన్నదాతలకు వ్యవసాయాన్ని మరింత చేరువచేశారు. ఒకటా రెండా వందలాది సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు ఉరికించారు. జనం గుండెల్లో దేవుడిలా గుడికట్టుకున్నారు. ప్రత్యర్థులు సైతం శభాష్ అనిపించేలా పాలన సాగించారు. ఆయనే దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన పాలనలో బాపట్ల ప్రాంత అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. జయంతి నేపథ్యంలో జిల్లా వాసులు దివంగత నేత పాలనను మరోమారు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
రైతులకు ‘ఉచిత’ విద్యుత్
బాపట్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.15 కోట్లతో బాపట్ల సమ్మర్ స్టోరేజి ట్యాంకు పరిధిలో ఫిల్టర్ బెడ్లు, పైపులైన్లు నిర్మించారు. బాపట్లతోపాటు తీరప్రాంతంలోని రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో రైతులు ఇసుక నేలల్లో మూడు పంటలు పండించుకుంటున్నారు.
హైలెవల్‌లో చీరాల పరుగులు
చీరాల నియోజకవర్గంలో రూ.120 కోట్లతో చీరాల అభివృద్ధి, రూ.6 కోట్లతో హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించారు. చేనేతల రుణాలు మాఫీచేసి అభయహస్తం అందించారు. వీటితోపాటు చీరాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. జిల్లాలోని పలు నియోజకవర్గాలలో సంక్షేమ, అభివృద్ధి పనులుచేపట్టారు.
న్యూస్‌రీల్
నేడు జిల్లా వ్యాప్తంగా
జయంతి వేడుకలు
పేద జనం గుండెల్లో గూడుకట్టుకున్న దేవుడు దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను మంగళవారం జిల్లాలో పెద్దఎత్తున నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అన్ని నియోజకవర్గాలలో దివంగత నేత విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
దివంగత వైఎస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి ఆరోగ్యశ్రీతో పేదలకు వైద్యం ఫీజు రీయింబర్స్‌తో పేద, మధ్యతరగతి వారికి ఉన్నత చదువులు తీరప్రాంత రైతులకు ఉచిత విద్యుత్ కో ఆపరేటివ్‌లోకి జంపని షుగర్ ఫ్యాక్టరీ నిజాంపట్నంలో సునామీ బాధితులకు పక్కా గృహాలు విజయవాడ నుంచి రేపల్లె వరకు కృష్ణా కరకట్ట నిర్మాణం అద్దంకిలో జలయజ్ఞం కింద మూడు సాగునీటి పథకాలు రూ.1100 కోట్లతో మేదరమెట్ల– నార్కెట్‌పల్లి రహదారి దివంగత నేతను కొనియాడుతున్న జిల్లా వాసులు ఆయన దారిలోనే కుమారుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలన నేడు జిల్లాలో ఘనంగా దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలు

మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025

మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025