
‘నూటా’ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు
ఏఎన్‌యూ: నూటా (ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధ్యాపక సంఘం) ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆచార్య కె.సుమంత్ కుమార్, ఆచార్య ఎం.జగదీష్ నాయక్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నూటా ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల అధికారి ఆచార్య ఎస్.మురళీమోహన్‌కు మంగళవారం వారిరువురూ వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల ప్రక్రియలోని లోపాలపై తాము హైకోర్టును ఆశ్రయించామని తమ పిటీషన్‌పై మంగళవారం వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు నూటా ఎన్నికల కోసం ఈనెల 1వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.