
ఆర్మీజవాన్ పార్థివదేహానికి నివాళులర్పించిన డాక్టర్ గణ
నగరం: జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీలో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి మృతి చెందిన ఆర్మీ జవాన్ ఉప్పాల రవికుమార్ పార్థివదేహం మంగళవారం స్వగ్రామమైన చిరకాలవారిపాలెం చేరింది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ఆర్మీ జవాన్ రవికుమార్ పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రవికుమార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆర్మీ అధికారులు రవికుమార్ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఇంకోల్లు రామకృష్ణ, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నిజాంపట్నం కోటేశ్వరరావు, యార్లగడ్డ మదన్‌మోహన్ పాల్గొన్నారు.