
ఆరుగురిపై పిచ్చి కుక్క దాడి
పెదకూరపాడు: పెదకూరపాడులోని ముస్లిం కాలనీలోని పిచ్చి కుక్క ఆరుగురుపై ఆదివారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్ల పఠాన్ మహ్మద్ అమన్, వృద్ధుడు షేక్ ఖాసిం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న షేక్ హుస్సన్, నిమ్మకాయల వ్యాపారి షేక్ ఖాసింలతో పాటు మరో ఇద్దరిపై దాడిచేసి కరచింది. నాలుగేళ్ల అమన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. జూన్ 18వ తేదిన మండలంలోని పాటిబండ్ల గ్రామానికి చెందిన చిన్నారులు, వృద్ధులు 16 మందిపై పిచ్చి కుక్క దాడి చేసింది. రోడ్డు పక్కనే మాంసం విక్రయాలు జరుపుతుండంతో గుంపులు కుక్కలు అమరావతి, సత్తెనపల్లి కాలచక్ర రోడ్డుపై తిరుగుతూ వాహనదారులను కరుస్తున్నాయి.

ఆరుగురిపై పిచ్చి కుక్క దాడి