
వేటపాలెం: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి పి.జ్యోతేంద్ర ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయి ఎంపికల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 బాలుర జట్టుకు ఎంపికై నట్లు హెచ్‌ఎం జీ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. బూదవాడలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికై నట్లు చెప్పారు. విద్యార్థిని పీఈటీలు ఎం.సీతాదేవి, యు.హనుమంతరావు అభినందించారు.
ఉద్యోగుల ఐక్యతతోనే సమష్టి విజయాలు: బొప్పరాజు
గుంటూరు వెస్ట్: ఉద్యో గులు ఐకమత్యంగా ఉంటే సమష్టి విజయాలు సాధించవచ్చని ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం జరిగిన 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పని పెరుగుతున్నా ఆ మేరకు సిబ్బంది పెరగకపోవడంతో ఉన్న ఉద్యోగులపైనే భారం పడుతోందన్నారు. దీనివల్ల ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడికి లోనై అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. అక్టోబర్ 1న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న రాష్ట్ర కౌన్సిల్‌ను జయప్రదం చేయాలని బొప్పరాజు కోరారు. ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ శాఖ కీలక భూమిక పోషిస్తుందన్నారు. సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు శాంతియుత ధర్నాలు, నిరసనలు తెలిపామన్నారు. కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా తరఫున తీవ్రంగా కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా సంఘం నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థితో ఉపాధ్యాయులు