
వేదికపై ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి, హాజరైన న్యాయమూర్తులు
గుంటూరు లీగల్: సుప్రీంకోర్టు, హైకోర్టుల నుంచి వస్తున్న నూతన తీర్పుల్ని న్యాయమూర్తులు అధ్యయనం చేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టులో రెండో రోజు ఆదివారం జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి. పార్థసారథి అధ్యక్షత వహించారు. జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు మాట్లాడుతూ చట్టాల్లో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గుంటూరు ఒకటో అడిషనల్ జిల్లా జడ్జి సీహెచ్. రాజగోపాలరావు, మూడో అడిషనల్ జిల్లా జడ్జి జి.అర్చన, నాలుగో అడిషనల్ జిల్లా జడ్జి ఆర్.శరత్ బాబు, పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.సీతారామ కృష్ణారావు, తెనాలి పదకొండో అడిషనల్ జిల్లా జడ్జి ఎం.వెంగయ్య, గురజాల పదో అడిషనల్ జిల్లా జడ్జి కె.జయకుమార్, జిల్లాలోని సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ సోమయాజులు

సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ సోమయాజులు