
షాదీఖానా ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న అంజాద్ బాషా
చేబ్రోలు: ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి షేక్ బెపారి అంజాద్ బాషా చెప్పారు. వడ్లమూడి గ్రామంలో రూ.60 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ షాదీఖానా ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. సమావేశానికి డీసీఎంఎస్ డైరెక్టర్ కుర్రా పాములు అధ్యక్షత వహించారు. మంత్రి అంజాద్‌బాషాతోపాటు శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు డెప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతోందన్నారు. ముస్లింల పక్షపాతి వైఎస్సార్ కుటుంబమని కొనియాడారు. శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం కృషిచేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా