
బాపట్లటౌన్: సూర్యలంక సముద్రంలో మునిగి వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం సూర్యలంక సముద్రతీరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సుమారు 60 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధుడు సూర్యలంక సముద్రతీరానికి వచ్చి అందరూ మునిగే ప్రదేశంలో కాకుండా దూరంగా వెళ్లి సముద్రంలోకి దిగాడు. అతడి ప్రవర్తనను గమనించిన తీరంలోని అవుట్ పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఎం.పోతురాజు, కానిస్టేబుల్ పి.వెంకటరావు, హోంగార్డు ఎన్.నరసింహమూర్తి, గజ ఈతగాళ్లు సుబ్బారావు, కోటయ్యలు వెంటనే స్పందించి సముద్రంలోకి వెళ్లి వృద్ధుడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఎండ ప్రభావంతోపాటు ఉప్పునీరు తాగడం వలన వృద్ధుడు నీరసంగా ఉండటాన్ని గమనించి వెంటనే ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వృద్ధుడి ఆరోగ్యం నిలకడగా ఉంది.
కాపాడిన పోలీసులు, గజ ఈతగాళ్లు