Weekly Horoscope: ఈ రాశి వారు వారం మధ్యలో శుభవార్త వింటారు

Weekly Horoscope Telugu 12-11-23 To 18-11-23 - Sakshi

మేషం..
ఆర్థిక విషయాలలో గందరగోళం తొలగుతుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు.  ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాములతో అంగీకారానికి వస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు.  శివాష్టకం పఠించండి.

వృషభం..
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతవిషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధిబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఉత్సాహంగా గడుపుతారు. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు.  ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం..
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఎటువంటి వివాదమైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఒక మిత్రుని ద్వారా అందిన సమాచారం మీలో కొత్త ఆశలు నింపుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని హోదాలు దక్కవచ్చు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం..
వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. పరిపరివిధాలుగా ఉండే ఆలోచనలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక విషయాలలో గందరగోళ పరిస్థితి నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి సహాయపడతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. విస్తరణ కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. బంధువులతో తగాదాలు. పసుపు, ఎరుపు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం..
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు చకచకా సాగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.  యుక్తితో సమస్యల నుంచి గట్టెక్కుతారు.  వ్యాపారాలు మరింత లాభిస్తాయి. కొత్త భాగస్వాముల సహాయం అందుతుంది. ఉద్యోగాలలో మీ ఉన్నతిని చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో  ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, నీలం రంగులు.  దేవీఖడ్గమాల పఠించండి.

కన్య..
కొత్తగా చేపట్టిన పనులు ముందుకు సాగక ఇబ్బందిపడతారు. ఆర్థిక విషయాలు కొంత నిరాశపర్చినా అవసరాలు తీరతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. స్థిరాస్తి వివాదాలు నెలకొని సతమతమవుతారు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు ఉండవచ్చు. వారం చివరిలో శుభవార్తలు. పరిచయాలు పెరుగుతాయి. గులాబీ, పసుపు రంగులు. గణపతి  స్తోత్రాలు పఠించండి.

తుల..
ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు. గృహ, వాహనయోగాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదల, ధైర్యంతో కొన్ని వివాదాలు నుంచి గట్టెక్కుతారు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉండవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రతిభ చాటుకుంటారు. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. స్వల్ప అనారోగ్య సూచనలు. తెలుపు, నేరేడు రంగులు.  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృశ్చికం..
ఆర్థిక లావాదేవీలు మరింత  ఆశాజనకంగా ఉంటాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చిస్తారు. విద్యార్థుల  ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు ఫలిస్తాయి. . వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, పసుపు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు..
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.  ఆప్తుల సలహాలతో ముందడుగు వేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. కొంతకాలంగా నిరీక్షిస్తున్న అవకాశాలు కొన్ని దగ్గరకు రావచ్చు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు సజావుగా లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను గుర్తిస్తారు.  రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కవచ్చు.  వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. తెలుపు, నేరేడు రంగులు.  శివస్తోత్రాలు పఠించండి.

మకరం..
ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి ఊహించని సాయం అందుతుంది. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. చిన్ననాటి  విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని వివాదాల పరిష్కారానికి చొరవ తీసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది.  వారం చివరిలో  ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. విష్ణుధ్యానం చేయండి.

కుంభం..
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి.. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన, గృహయోగాలు కలిగే సూచనలు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగప్రాప్తి. ఒక దీర్ఘకాలిక సమస్య ఎట్టకేలకు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. కళారంగం వారి ఆశలు కొన్ని ఫలిస్తాయి. . వారం ప్రారంభంలో కొత్త రుణయత్నాలు. అనారోగ్యం. తెలుపు, ఆకుపచ్చ రంగులు.  దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి..

మీనం..
సంఘంలో మీరంటే ప్రత్యేక గౌరవం ఏర్పడుతుంది. మిత్రులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వ్యవహారాలలో  విజయం సాధిస్తారు.  నిరుద్యోగులు, విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో అవాంతరాలు అధిగమిస్తారు.  మరపురాని సంఘటన ఒకటి ఎదురవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములు మీ సలహాలు పాటిస్తారు. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. పారిశ్రామికవర్గాలకు కొత్త అనుమతులు లభించే వీలుంది.  వారం ప్రారంభంలో అనుకోని  ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, గులాబీ రంగులు.  శ్రీరామస్తోత్రాలు పఠించండి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top