Weekly Horoscope: ఈ రాశుల వారికి అంతా శుభమే, ధన లాభం

Weekly Horoscope Telugu 12 02 2023 To 18 02 2023 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ.  విలువైన వస్తువులు కొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. తెలుపు,బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. ఓర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువుల సలహాలు పాటించి ముందడుగు వేస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. ఎక్కువగా శ్రమపడాలి.  ఆకుపచ్చ, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధలు కాస్త తీరతాయి. భవిష్యత్‌పై నిరుద్యోగులకు కొత్త ఆశలు. స్నేహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఒత్తిడులు. గులాబీ, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పనుల్లో ముందడుగు వేస్తారు. ఆదాయం మరింత పెరిగే అవకాశం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవేత్తలకు పదవీయోగాలు. వారం ప్రారంభంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఏకాగ్రత లోపిస్తుంది. శ్రమ తప్పదు. పసుపు, లేత ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహన, కుటుంబసౌఖ్యం. మీ అంచనాలు నిజమవుతాయి. రాబడి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. కళాకారులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. వారం మధ్యలో మిత్రుల నుంచి ఒత్తిడులు. గులాబీ,తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
చేపట్టిన పనులలో కొంత జాప్యం. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబసభ్యులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయనేతలకు కొంత నిరాశ తప్పదు. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. ధనలబ్ధి. పసుపు, లేతనీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలు విజయ వంతంగా పూర్తి. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ కృషి ఫలించే సమయం. జీవిత భాగస్వామితో తగాదాలు తీరతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు గుర్తింపు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎరుపు, చాక్లెట్‌ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అదనపు ఆదాయం సమకూరుతుంది. మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు.  వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం. అనారోగ్యం. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. నిరుద్యోగులకు అంచనాలు నిజమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో కొద్దిపాటి వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆదాయం పెరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిర్ణయాలలో మాత్రం కొంత నిదానం అవసరం. దేవాలయాలు సందర్శిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు. వారం చివరిలో కుటుంబంలో ఒత్తిడులు. ఖరీదైన వస్తువులు జాగ్రత్త. గులాబీ, లేత ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆశ్చర్యకరమైన సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. సోదరుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. నీలం, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త విషయాలు గ్రహిస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారుల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. లేత నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top