ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 29-03-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు

Mar 29 2026 3:01 AM | Updated on Mar 29 2026 3:01 AM

Rasi Phalalu: Daily Horoscope On 29-03-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.ఏకాదశి ఉ.8.54 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఆశ్లేష సా.3.44 వరకు తదుపరి మఖ, వర్జ్యం: రా.3.30 నుండి 5.04 వరకు, దుర్ముహూర్తం: సా.4.32 నుండి 5.18 వరకు, అమృత ఘడియలు: ప.2.10 నుండి 3.44 వరకు, మతత్రయ ఏకాదశి.

సూర్యోదయం : 6.01
సూర్యాస్తమయం : 6.08
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం... అనుకున్న పనులు కొంత నిదానిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ యత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో పనిభారం.

వృషభం... కొత్త విషయాలు తెలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశయాలు నెరవేరే సమయం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.

మిథునం... వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు.

కర్కాటకం... ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. పాత మిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

సింహం... సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కన్య... మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

తుల... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో చర్చలు. ఆర్థిక విషయాలలో పురోగతి. కుటుంబసమస్యల నుంచి విముక్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృశ్చికం... మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు... శ్రమ పెరుగుతుంది. పనుల్లో స్వల్ప ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు దర్శిస్తారు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో పనిభారం.

మకరం.... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ, విద్యాయత్నాలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం... మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ధన, వస్తులాభాలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కే అవకాశం.

మీనం... వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement