ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం | Rasi Phalalu: Daily Horoscope On 30-03-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం

Mar 30 2026 3:40 AM | Updated on Mar 30 2026 7:18 AM

Rasi Phalalu: Daily Horoscope On 30-03-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.ద్వాదశి ఉ.7.40 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: మఖ సా.3.20 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: రా.11.17 నుండి 12.55 వరకు, దుర్ముహూర్తం: ప.12.27 నుండి 1.15 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు, అమృత ఘడియలు: ప.12.56 నుండి 2.31 వరకు.

సూర్యోదయం : 6.00
సూర్యాస్తమయం : 6.08
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం... పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం.... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. వ్యయప్రయాసలు. ఆలయ దర్శనాలు.  వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

మిథునం.... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ధనలబ్ధి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం..... మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం... శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  భూ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కన్య..... శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

తుల... కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగలాభం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

వృశ్చికం.... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

ధనుస్సు... కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దైవదర్శనాలు.  బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

మకరం.... రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కుంభం.... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. విద్యార్థులకు నూతనోత్సాహం.  వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.

మీనం... మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

Advertisement
 
Advertisement
Advertisement