Today Telugu Horoscope: ఈ రాశి వారు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు | Horoscope Today 11 November 2023 In Telugu || Today Rasi Phalalu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు

Nov 11 2023 5:34 AM | Updated on Nov 11 2023 8:30 AM

today rasi phalalu daily horoscope 11 11 2023  - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.త్రయోదశి ప.12.47 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం: చిత్త రా.1.43 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.8.30 నుండి 10.15 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.04 నుండి 7.34 వరకు, అమృతఘడియలు: సా.6.49 నుండి 8.33 వరకు, శని త్రయోదశి, మాసశివరాత్రి. యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు, రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం : 6.06, సూర్యాస్తమయం :  5.22

మేషం... బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. 

వృషభం.. కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. కళాకారులకు నూతనోత్సాహం. 

మిథునం.... ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. రుణయత్నాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. 

కర్కాటకం..... కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాపరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. 

సింహం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి,వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి. 

కన్య.... ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. 

తుల..... బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. 

వృశ్చికం.... వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో  మాటపట్టింపులు. ఆలయదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. దైవచింతన. 

ధనుస్సు.... శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. 

మకరం... నూతన ఉద్యోగయోగం. పనుల్లో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి,వ్యాపారాలలో పురోగతి. 

కుంభం.. రుణయత్నాలు. ఆర్థిక లావాదేవీలు కొంత మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆలయదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. అనారోగ్యం. 

మీనం... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement